న్యూఢిల్లీ: ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు మరో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ పోటీల్లో భారత్ క్లీన్‌స్వీప్ సాధించింది. స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను భారత షూటర్లు గెలుచుకున్నారు. 23 ఏళ్ల చింకి యాదవ్ అసాధారణ ప్రతిభతో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో భారత్‌కే చెందిన స్టార్ షూటర్ రహీ సర్నోబోత్‌ను 43 తేడాతో ఓడించింది. ఇక భారత్‌కే చెందిన మను బాకర్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగం పోటీల్లో భారత్‌కు చెందిన యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం గెలుచుకున్నాడు. అద్భుత ప్రతిభను కనబరిచిన తోమర్ 462.5 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో హంగేరికి చెందిన అగ్రశ్రేణి షూటర్ ఇస్తనాన్ పెనిను రెండో స్థానంలోకి నెట్టాడు. డెన్మార్క్ షూటర్ స్టీఫెన్ ఓల్సెన్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.