- Advertisement -
హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కృష్ణ దాస్ బెయిల్ కోసం 11 మంది న్యాయవాదులు ఆయన తరుపున వాదనలు వినిపించినా లాభం లేకపోయింది. విచారణ సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంపై ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధా రామన్ దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ సన్యాసికి న్యాయం జరిగేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, నవంబర్ 26న దేశద్రోహ నేరం కింద కృష్ణ దాస్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
- Advertisement -