Sunday, December 22, 2024

తమ్ముడు మోసం… పిల్లలతో కలిసి అన్న అత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తమ్ముడికి ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నపై అతడు దాడి చేసి పరుష పదజాలంతో దూషించాడు. దీంతో అన్న ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కస్తూరిపల్లి గ్రామంలో లచ్చవ్వ ఇద్దరు కుమారులు సత్యం, శ్రీనివాస్ ఉన్నారు. సత్యం మొదటి భార్య చనిపోవడంతో పది సంవత్సరాల క్రితం శిరీష్‌ను పెళ్లి చేసుక్నుడు. ఈ దంపతులకు అన్విష్ నందన్, కూతురు త్రివర్ణ హాసిని ఉన్నారు. శ్రీనివాస్‌కు పెళ్లి చేయడంతో లక్షన్నర అప్పులు అయ్యాయి. అవసరాల నిమిత్తం సత్యం దగ్గర తమ్ముడు శ్రీనివాస్ నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. శ్రీనివాస్ దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

దీంతో చిన్న కుమారుడు తన భార్య, తల్లి లచ్చవ్వతో కలిసి వేరే కాపురం పెట్టాడు. గత సంవత్సరం నుంచి సత్యానికి అనారోగ్య సమస్యలు రావడంతో పది లక్షల వరకు ఆస్పత్రిలో ఖర్చు చేశారు. అప్పులు ఎక్కువ కావడంతో తమ్ముడిని ఇచ్చిన 5.5 లక్షలు ఇవ్వాల్సిందిగా అన్న కోరాడు. దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. అన్నపై తమ్ముడి దాడి చేయడంతో పాటు పరుష పదజాలంతో దూషించారు. దీంతో మనస్థాపం చెందిన అన్న తన కుమారుడు, కూతురుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశౠరు. సత్యం భార్య శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ లో పోలీసులకు సైసూడ్ నోట్ లభించింది. ‘నా చావుకు తమ్ముడే కారణం’ అన సూసడ్ నోట్ లో రాసి ఉందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News