- Advertisement -
హైదరాబాద్ : చిన్నపాటి వర్షానికి హైదరాబాద్‌లో కాలనీలు మునిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్‌గౌడ్, గౌతమ్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. నాలాల నుంచి వెళ్లాల్సిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోందన్నారు. ఇది విశ్వ నగరమా.. విషాద నగరమా అని ఆయన ప్రశ్నించారు.
తొమ్మిదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. నగరంలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ, మూసీ నది సుందరీకరణ, హుస్సేన్‌సాగర్ అభివృద్ధి చేస్తామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టక పోతే హైదరాబాద్‌లో ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడుతామని వెల్లడించారు.
- Advertisement -