Tuesday, December 24, 2024

చింతామణికి ఎవరు సొంత మొగుడు అవుతారు?

- Advertisement -
- Advertisement -

శ్రీ స్కందాగ్రజ పతాకంపై రాజేంద్ర ప్రసాద్, మధు ప్రియా జంటగా శివ నాగేశ్వరావు వీరేళ్ళ స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ‘చింతామణి సొంత మొగుడు‘. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్‌ను, పాటలను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి పాటలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ మాట్లాడుతూ “ఈ సినిమాలో ఎవరు చింతామణికి సొంత మొగుడు అవుతారు అనేదే సస్పెన్స్. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాజేంద్ర ప్రసాద్, ఆనంద్ భారతి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, ఎంఎస్ నాయుడు, చెన్నకేశవ, అవంతిక, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News