Monday, April 14, 2025

ఎసిబి వలలో చింతలపాలెం ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

సూ ర్యాపేట జిల్లా, చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ మంగళవారం ఎసిబికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పిడిఎస్ బియ్యం కేసులో నిందితుడు స్టేషన్ బెయిల్ కోసం ఎస్‌ఐ రూ.15వేలు డిమాండ్ చేశా డు. అయితే, తన వద్ద రూ.10వేలు ఉన్నాయని చెప్పిన బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం అందించాడు. వారు సూచించిన మేరకు ముందుగానే డబ్బులకు పింక్ కలర్ కెమికల్ వేయడంతో ఎస్‌ఐ రూ.10వేలు తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్తుండగా ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News