Thursday, January 23, 2025

గుజరాత్‌కు గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుజరాత్‌లో చిప్ తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో అతిపె ద్ద గనుల సంస్థ అయిన వేదాంత లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ నుంచి వైదొలగుతున్నామని సోమవారం తైవాన్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ ప్రకటించింది. వేదాంతతో కలిసి 19.5 బిలియన్ డాలర్ల (రూ.1,61,098 కోట్లు) సెమికండక్టర్ జాయింట్ వెంచర్‌ను ఫాక్స్‌కాన్ అమలు చేయాల్సి ఉంది.ఈ ఒప్పందం 2022లో ఇరు కంపెనీల మధ్య జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రధాని మోడీ రాష్ట్రమైన గుజరాత్‌లో సెమికండక్టర్, డిస్‌ప్లే ఉత్పత్తి విడిభాగాల కేంద్రాన్ని ఏ ర్పాటు చేయాల్సి ఉంది.‘వేదాంతతో జాయింట్ వెంచర్‌పై ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకు న్నాం’అని ఫాక్స్‌కాన్ ప్రకటించింది.దీనికి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలే దు. జాయింట్ వెంచర్ ఉపసంహరణ ఇరు కంపెనీల మధ్య పరిష్కారం అవుతుందని కంపెనీ తెలిపింది.

వేదాంత మాత్రం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని ప్రకటించింది. సెమికండక్టర్ ప్రాజెక్టును ఏ ర్పాటు చేసేందుకు కంపెనీ పూర్తిగా కట్టుబడి ఉం దని, దీని ఏర్పాటు కోసం ఇతర భాగస్వాముల కోసం చూస్తున్నామని తరువాయి 12లో
వేదాంత ప్రకటించింది. సెమికండక్టర్ బృందాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రముఖ ఐడిఎం (ఇంటిగ్రేటెడ్ డివైజ్ మానుఫ్యాక్చరర్) నుండి 40 ఎన్‌ఎం స్థాయి ఉత్పత్తి సాంకేతికత కోసం లైసెన్స్‌ను కల్గివున్నామని వేదాంత తెలిపింది. త్వరలో 28 ఎన్‌ఎం ఉత్పత్తికి లైసెన్స్‌ను సాధిస్తామని, ప్రధాని కలను నెరవేరుస్తామని కంపెనీ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News