Wednesday, January 22, 2025

ఎన్‌డిఎలోకి చిరాగ్ ఎల్‌జెపి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌డిఎలో చేరాలని లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి చెందిన కీలక వర్గం నేత చిరాగ్ పాశ్వాన్ నిర్ణయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి , దివంగత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. మంగళవారం ఇక్కడ ఎన్‌డిఎ భేటీ నేపథ్యంలో చిరాగ్ తమ నిర్ణయం సోమవారం ప్రకటించారు. అంతకు ముందు ఆయన బిజెపి ఎన్నికల ఇతరత్రా వ్యూహకర్త అమిత్ షాతో చాలా సేపు భేటీ అయ్యారు. తరువాత ఎన్‌డిలో చేరేందుకు తమ ఎల్‌జెపి నిర్ణయించుకుందని విలేకరులకు చెప్పారు. చిరాగ్ ఎల్‌జెపికి తమ స్వాగతం అని ఈ దశలో బిజెపి నేత జెపి నడ్డా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News