న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు కేటాయించిన ప్రభుత్వ బంగళాను లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ బుధవారం ఎట్టకేలకు ఖాళీ చేసే ప్రక్రియను చేపట్టారు. బంగళాను ఖాళీ చేయాలని ప్రభుత్వం గత ఏడాది నోటీసు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో దగ్గరుండి బంగళాను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం అధికారుల బృందాన్ని అక్కడకు పంపింది. దీంతో చిరాగ్ పాశ్వాన్ లుట్యన్స్‌లోని జన్‌పథ్‌లోగల తన తండ్రికి కేటాయించిన బంగళాలోని వస్తువులను ట్రక్కులలోకి ఎక్కించడం చేపట్టారు. సామాన్లతో రెండు ట్రక్కులు బయల్దేరగా మరో నాలుగు ట్రక్కులు ఇంటి బయట ఉన్నాయి. కేంద్ర మంత్రులకు ఈ ప్రాంతంలో నివాస భవనాలను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కేటాయిస్తుంది. పాశ్వాన్‌కు కేటాయించిన బంగళాను లోక్‌జనశక్తి పార్టీ కార్యాలయంగా కూడా వాడుకుంటున్నారు.
Chirag Paswan vacating Janpath Bungalow in Delhi