Sunday, December 22, 2024

‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

కార్తికేయ కథానాయకుడిగా ఇప్పుడు ‘భజే వాయు వేగం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. చిరంజీవికి తాను వీరాభిమానినని పలు సందర్భాలలో కార్తికేయ చెప్పాడు. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చానని చెబుతూ మంచి మార్కులు కొట్టేశాడు. అలా తన తాజా చిత్రం టీజర్ ను చిరంజీవి లాంచ్ చేసేలా చూసుకున్నాడు.

ఒక వైపున డ్రగ్స్  .. మరో వైపున తండ్రీ కొడుకుల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ టీజర్ వల్ల తెలుస్తోంది.  ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ‘హ్యాపీడేస్’ రాహుల్ టైసన్ , తనికెళ్ల భరణి , రవి శంకర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి రథన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News