Thursday, December 19, 2024

మంత్రి రోజా పై మండిపడ్డ వైసిపి నేతలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి టూరిజం మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సమయం దొరికినప్పుడల్లా మాటల దాడి చేస్తుంది. అలాగే మెగా బ్రదర్స్ చిరంజీవి ,నాగబాబు పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యాలు చేశారు. సాధారణంగా నటీనటులు సెన్సిటివ్, ఎమోషనల్గా ఉంటారు. ఎంజిఆర్, జయలలిత, ఎన్ టిఆర్ వంటి దిగ్గజాలు ప్రజల నుండి చాలా గౌరవం పొందారని, కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఎలాంటి ఎమోషన్స్ లేవని ఆమె అన్నారు.

ముగ్గురు అన్నదమ్ములను సొంత నియోజకవర్గాల్లోనే ప్రజలు తిరస్కరించారని రోజా అన్నారు. మెగాస్టార్ చిరంజీవిపై రోజా కామెంట్లు చేయడంతో చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజా చిరంజీవి పేరును అనవసరంగా లాగడంపై వైసిపి నేతలు కూడా మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News