Wednesday, March 12, 2025

ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది

- Advertisement -
- Advertisement -

Chiranjeevi 153 movie is God Father

 

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించడానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి పుష్పగుచ్ఛంతో సల్మాన్‌కు స్వాగతం పలికారు. ఇప్పటికే అతను ముంబయ్‌లో షూట్‌లో చేరారు.

“భాయ్ సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది… ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు” అని చిరంజీవి పోస్ట్ చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ బాణీలు అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News