Sunday, December 22, 2024

మెగాస్టార్ బర్త్‌డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాలు మెగా156, మెగా 157లను మంగళవారం ప్రకటించారు. మెగా156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా156 మూవీ రూపొందనుంది. త్వరలోనే చిత్ర దర్శకుడిని ప్రకటిస్తారు. ’నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ. భావోద్వేగాలను కలిగించే అపారమైన వ్యక్తిత్వం. తెరపైన, బయట పండగ లాంటి వ్యక్తి. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు మెగా156 మెగా రాకింగ్ ఎంటర్‌టైనర్ అవుతుంది. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు” అని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. ఇదిలాఉండగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఈ ప్రకటనతో మరింత సంతోషిస్తారు.

చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న మెగా157 మూవీ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వుంటుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం ప్రకటించిన ఈ సినిమాతో వశిష్ట మనకు మెగా మాస్ యూనివర్స్ చూపించబోతున్నారు. విజువల్ గా కట్టిపడేస్తున్నఅనౌన్స్ మెంట్ పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు ) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ మెగా మాస్ యూనివర్స్‌కు సాక్ష్యంగా నిలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News