‘సంక్రాంతికి వస్తున్నాం’తో మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన నెక్స్ బిగ్ స్క్రీన్ షో కోసం సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేయబోతున్నారు. తన అద్భుతమైన కామిక్ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరుపొందిన అనిల్ రావిపూడి కామెడీ, ఎమోషన్, యాక్షన్‌ను మిళితం చేసే స్క్రిప్ట్‌తో చిరంజీవిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు.
ప్రతిష్టాత్మక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సాహు గారపాటి నిర్మించే ఈ చిత్రం పండగ వైబ్స్, ఎమోషన్స్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ వినోదంతో హెల్తీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. చిరు, అనిల్ కోసం అంతా లాక్, లోడ్ అయ్యింది. అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ స్క్రిప్ట్ వినిపించారు. స్క్రిప్ట్‌తో థ్రిల్ అయ్యారు మెగాస్టార్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ ఆశీస్సులు లభించడంతో, ఈ చిత్ర బృందం ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో వర్క్ చేస్తోంది.
గ్రాండ్ లాంచ్‌కు ముందే మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయనున్నారు. ఈ చిత్రానికి ప్లేఫుల్ ట్విస్ట్‌ని జోడిస్తూ, చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రను పోషిస్తున్నారు. మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ అవతార్ లో కనిపిస్తారు, తన ఎఫర్ట్‌లెస్ చార్మ్‌తో అలరించబోతున్నారు. అనిల్ రావిపూడి, చిరంజీవిల సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే నవ్వుల వినోదాన్ని అందిస్తుంది.