Thursday, January 23, 2025

చాలా సర్‌ప్రైజ్‌లతో సమ్‌థింగ్ స్పెషల్‌గా…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువి కియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. విశ్వంభర సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే మెగాభిమానులకు పండుగలా ఉంటుంది. విశ్వంభర సినిమాలో పవన్ గెస్ట్ రోల్ చేస్తే సినిమా రేంజ్ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా విశ్వంభర సినిమా విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటోంది. కీరవాణి మ్యూజిక్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈ సినిమాను 2025 జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News