Monday, December 23, 2024

‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Chiranjeevi act in Waltair veerayya

మెగా స్టార్ చిరంజీవి వరుస చిత్రాల్లో నటిస్తూ మెగా అభిమానులను ఖుష్ చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ రిలీజ్ కాగా.. తాజాగా బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘మెగా 154’ టైటిల్ తెలిసిపోయింది. చిరంజీవే స్వయంగా ఈ టైటిల్ చెప్పడం విశేషం. ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటి వరకు మేకర్స్, డైరెక్టర్ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నోరు జారి ఈ సినిమా టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’గా వినిపించింది. అయితే అదే టైటిల్ తాజాగా చిరంజీవి నోట వినిపించింది. మెగా 154 చిత్ర టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’గా చిరు తెలిపారు. దీంతో ఈ టైటిల్ పక్కా అయినట్టు తెలిసిపోయింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మెగా 154 నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సముద్రంలోకి బోట్‌లో చేపల వేటకి వెళ్తున్న చిరంజీవి బ్యాక్ సైడ్ లుక్ అదిరిపోయింది. అయితే ఇందులో చిరు లుంగీ కట్టడం విశేషం. సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే అందుకు తగ్గట్టుగానే మాస్ టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ను ఖరారు చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది. అదేవిధంగా చిరు ‘గాఢ్ ఫాదర్’ చిత్రాన్ని మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తుండగా.. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొంటోంది. మరోవైపు మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు చిరు. ఇందులో ఆయనకు చెల్లిగా కీర్తిసురేష్, హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News