నటుడిగా నందమూరి బాలకృష్ణ ప్రయాణానికి 50ఏ ళ్లు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది. టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సినీ ప్రముఖు లు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, మంచు మోహన్ బాబు, బి.గోపాల్, పరుచూరి బ్రదర్స్, దిల్ రాజు, బోయపాటి శ్రీ ను, అనిల్ రావిపూడి, సాన బుచ్చిబాబు, తమన్, మంచు విష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, విజయేంద్ర ప్రసాద్, మంచు లక్ష్మి, బ్ర హ్మానందం, అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సునీ ల్, చెరుకూరి సుధాకర్, కేఎల్ నారాయణ, తు మ్మల ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి, దామోదర్ ప్రసాద్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సు మలత తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు.
బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అతిథులు అంతా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకు డైరెక్టర్ రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి అతిథులను అలరించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ఈ వెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన శైలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటూ ఎమ్మెల్యే రఘురా మ కృష్ణంరాజును పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ “బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఒక వేడుక. అరుదైన రికార్డు బాల య్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్‌కి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ యన కొడుకుగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు వి షయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సిని మా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సిని మా చేయాలని ఒక కోరిక. బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి మీ ఇద్దరికీ నా ఛాలెంజ్. మా ఇ ద్దరితో కలిసి ఒక సినిమా చేయండి”అని అన్నా రు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “నా కుటుంబమైన నిర్మాతలు, దర్శకులు, నటులు, క ళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంతాకలిసి ఈ వేడుకను ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉండి నడిపించిన ‘మా’ అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. నే ను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్ర మే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలత, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను” అని తెలిపారు.