Sunday, January 19, 2025

వెంకటేష్ తో కలిసి నటిస్తా: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమా అంటే తనకెంతో ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వెంకీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, 1983లో సురేష్ ప్రొడక్షన్స్‌లో సంఘర్షణ అనే సినిమాలో తాను నటించానని చెప్పారు. అప్పుడే సురేష్ బాబు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు. వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ్ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకీ 75 కలియుగ పాండవులు-సైంధవ్ పేరుతో హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.

అప్పుడే రామానాయుడు మరో కుమారుడు ఉన్నాడని తెలిసిందని, ఎలా ఉంటాడని అడిగానని, పర్లేదు బాగానే ఉంటాడని అక్కడి నుంచి సమాధానం వచ్చింది, అందగాడు వెంకటేష్‌ను చూశానని, వెంకటేష్ హీరోగా వస్తే మన పరిస్థితి ఏంటి టెన్షన్ పట్టుకుందని, కానీ వెంకటేష్ సినిమాలపై ఆసక్తి లేదని తెలియగానే ఊపిరి పీల్చుకున్నానని వివరించారు.

మరో రెండేళ్ల తరువాత సినిమా రంగంలోకి వెంకటేష్ ప్రవేశించారని, అప్పటి నుంచి ఇద్దరు కలిసి మెలిసి మిత్రులుగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే వెంకటేష్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని చిరు పేర్కొన్నారు. వెంకీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని అందంగా నిర్మించుకున్నారని ప్రశంసించారు. సురేష్ బాబు లాంటి అన్నయ్య ఉండడంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మానసిక ఆనందాన్ని ఇచ్చే వేడుక ఇది మనస్ఫూర్తిగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News