మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా విశ్వంభర అనే భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత చిరు సాలిడ్ లైనప్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లైనప్‌లో దర్శకుడు అనీల్ రావిపూడితో ఒక భారీ ఎంటర్‌టైనర్‌ని కూడా ప్లాన్ చేయగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాని కూడా అనీల్ తన మార్క్ స్పీడ్‌తో పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నా రు. ప్రస్తుతం అనీల్ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలోనే ఉన్నారట. అలాగే చిరు కూడా విశ్వంభర పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉండగా…
ఆ తర్వాత అనీల్ సినిమాపై దృష్టి పెట్టనున్నారట. అయితే అనిల్, – చిరు కాంబినేషన్‌లో రాబోతున్నకామెడీ ఎంటర్‌టైనర్ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో ప్రారంభమై అక్టోబర్‌లో పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది.