Sunday, January 19, 2025

సిఎంకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు, కొత్త మంత్రివర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చిరంజీవి అకాంక్షించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరుకలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ తో వ్యక్తిగతంగా స్నేహం ఉందన్న పవన్, వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన రేవంత్  రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా సంక్షేమం.. అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ ఎక్స్ లో వేదికగా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News