Sunday, December 22, 2024

యూరప్ వెళ్తున్న చిరంజీవి, శృతి హాసన్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ నిన్ననే అధికారికంగా ప్రకటించారు.

‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. అక్కడ వండర్ ఫుల్ లోకేషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ’.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News