Monday, December 23, 2024

మెగా ప్రిన్సెస్ పేరును ప్రకటించిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్, ఉపాసనలకు ఈ నెల 20వ తేదిన ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన పాప ఉయ్యాల వేడుకలో ఈ మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేశారు. ఈ పాపకు ‘క్లీంకార కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నామని చిరంజీవి తెలిపారు.

“క్లీంకార… ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యున్నత శక్తిని సూచిస్తుంది. మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను”అని ఆయన పేర్కొన్నారు. ఇక రామ్‌చరణ్, ఉపాసన, తనతో పాటు భార్య సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు అనిల్ కామినేని, శోభనా కామినేనిలతో కలిసి ఉయ్యాలలో ఆడుకుంటున్న పాపతో ఉన్న ఫోటోను షేర్ చేశారు మెగాస్టార్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News