Wednesday, January 22, 2025

జూన్ 24న ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ‘భోళా శంకర్’. ఇటీవల భోళా మ్యూజిక్ మానియా మొదలైంది. సినిమాలో మొదటి పాట విడుదల చేయగా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. చిరంజీవి లీక్ చేసిన సంగీత్ సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి పోస్టర్ ఆడియన్స్, అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచింది. ఇప్పుడు భోళా శంకర్ నుంచి మరో గిఫ్ట్ రెడీ అయ్యింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ టీజర్ జూన్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి కొత్త స్టైల్ సూపర్ వుంది. బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ మీద చెక్ షర్ట్ వేసిన మెగాస్టార్ సీరియస్ వాకింగ్ స్టైల్, ఆ లుక్ లో ఇంటెన్సిటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్, ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండ్ అవ్వడమే కాదు, సినిమాపై అంచనాలు పెంచాయి. మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్ కి తగ్గట్టు మహతి స్వర సాగర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ట్యూన్ అందించారు. లిరికల్ వీడియోలో కొన్ని స్టెప్స్ చూపించినా, అవి వైరల్ అయ్యాయి. టీజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News