Monday, January 20, 2025

‘బింబిసార’ దర్శకుడితో మెగాస్టార్.. ఆసక్తికరంగా పోస్టర్

- Advertisement -
- Advertisement -

‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం తెరకెక్కబోతోంది. మంగళవారం చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న #మెగా157 మూవీని చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం(పంచభూతాలు ) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News