Thursday, January 23, 2025

ఆ స్థానం నాకొద్దు: మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో తాను ఉండనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం ఉదయం సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే, సినీ కార్మికులు.. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని కోరారు. గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరని,  ఏదైనా సమస్య వస్తే వెంటనే చిరంజీవి ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుందని.. అందుకే మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని సినీ కార్మికులు మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు ఇష్టంలేదు. ఆ స్థానం నాకొద్దు.. నేను సంచాయతీలు చేయను. ఇద్దరు కొట్టుకొని పంచాయతీ చేయమంటే నేను చేయను. కానీ, సినీ ఇండస్ట్రీకి, కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుంటా” అని చెప్పారు.

Chiranjeevi comments on Cine Industry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News