Sunday, December 22, 2024

నాకు స్టార్డమ్ ఒక్క రోజులో రాలేదు: మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

కెరీర్ పరంగా తాను ఎంతో కష్టపడ్డానన్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు ఈ స్టార్డమ్ ఒక్క రోజులో వచ్చింది కాదన్నారు. చదువుకునే రోజుల్లో ఎన్నో నాటకాలు వేసేవాణ్ననీ, తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపించేవారనీ, నటుడిగా మారాలన్న బీజం తనలో అప్పుడే మొలకెత్తడం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. తెలుగు డిజిటల్ మీడియా సమాఖ్య వేడుకల సందర్భంగా మెగాస్టార్ ను హీరో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ సినిమాల్లోకి ప్రవేశించాక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టపడి ఎదిగానన్నారు. కెరీర్ తొలి రోజుల్లో మద్రాసులో ఒకసారి స్నేహితుడితో కలసి పాండీ బజార్ వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు నన్ను చూసి “ఏంటీ, సినిమాల్లో హీరో అవుదామని వచ్చావా?” అంటూ హేళన చేశారని మెగాస్టార్ గుర్తు తెచ్చుకున్నారు. తమ కుటుంబంలో నాన్నే ఫ్యామిలీ స్టార్ అని చిరు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు మిక్కీ మౌస్ వంటి కామిక్ చిత్రాలు, జాకీ చాన్ సినిమాలు చూడటమంటే  మహా సరదా అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News