- Advertisement -
హైదరాబాద్: తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని ప్రముఖ హీరో చిరంజీవి అన్నారు. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన చిరంజీవి అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఆఫర్లు ఎవరూ ఇవ్వరని చెప్పారు. అలాంటి ఆఫర్లకు తాను అతీతం, అలాంటి ఆఫర్లకు లోబడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. పదవులను కోరుకోవడం తన అభిమతం కాదన్నారు.
- Advertisement -