Sunday, December 22, 2024

ఉద్రిక్తతకు దారి తీసిన యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చోరీ కేసులో విచారణకు తీసుకుని వచ్చిన యుకుడు చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన సికింద్రాబాద్, తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్‌బి నగర్‌కు చెందిన చిరంజీవిని బైక్ చోరీ కేసులో తుకారాంగేట్ పోలీసులు విచారణ కోసం మంగళవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. బైక్ చోరీ జరగడంతో పోలీసులు స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. దానిలో లభించిన క్లూ ఆధారంగా ఇద్దరు కానిస్టేబుళ్లు చిరంజీవిని పిఎస్‌కు విచారణ కోసం తీసుకుని వచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి అనారోగ్యానికి గురికావడంతో పిఎస్‌లోనే పడిపోయాడు.

వెంటనే పోలీసులు చిరంజీవులను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో తమ కుమారుడిని పోలీసులే కోట్టి చంపారని చేశారని కుటుంబ సభ్యులు నార్త్‌జోన్ డిసిపి ఆఫీస్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన చిరంజీవి కుటుంబ సభ్యులను వెంటనే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. తమకు న్యాయం చేసే వరకు గాంధీ ఆస్పత్రి నుంచి కదలమని చిరంజీవి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో ఎవరి ఉంచకుండా బయటికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News