Wednesday, January 22, 2025

కృష్ణ మరణం మాటలకు అందని విషాదం: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిరంజీవి తన ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఈ విషాదం మాటల్లో చెప్పలేనిది, సూపర్ స్టార్ కృష్ణ ఇక మన మధ్య లేడని నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం,ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం వీటి కలబోత కృష్ణ అన్నారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు అని చిరంజీవి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సహసాలు చేసిన కృష్ణకి అశ్రునివాళి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరు కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News