మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గాడ్ ఫాదర్’. తాజాగా ఈ మూవీ నుంచి చిరు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రజలు ఎదురుచూస్తుండగా.. చిరు నల్ల కళ్లద్దాలు ధరించి వింటేజ్ కారులో నుంచి దిగి పవర్ ఫుల్ లుక్ తో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాను దసరా కానుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Chiranjeevi first look out from GodFather