మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్‌లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్లో ఉంటున్నారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివశంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తమకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివశంకర్ మాస్టర్‌కు మేమంతా ఉన్నామని అభయమిచ్చారు.