Thursday, January 23, 2025

‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’గా మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆయన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’గా ఎంపికయ్యారు. ఆదివారం ఈ చలన చిత్రోత్సవాల్లో గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కడం విశేషం. చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా 150కి పైగా సినిమాల్లో నటించి పలు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఇక, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఆదివారం ప్రారంభమైన ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈనెల 28 వరకు కొనసాగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలో 79 దేశాల నుంచి మొత్తం 280 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో 25 ఫీచర్ సినిమాలు, 20 నాన్-ఫీచర్ సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’గా ఎంపికకావడంతో పలువురు సినీ ప్రముకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi honoured with Indian film personality of the year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News