మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ’లూసిఫర్’ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ స్టార్ హీరో మోహన్ లాల్ పోషించిన పవర్‌ఫుల్ పాత్రలో చిరు కనిపించనున్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ మోహన్ రాజా ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడకపోయుంటే ఈ చిత్రాన్ని ఈ పాటికే మొదలు పెట్టేవారు. అయితే పరిస్థితులు ఇప్పుడు చక్కబడటంతో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ పనులను తాజాగా ప్రారంభించారు. ముందుగా ఓ భారీ సెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం అద్భుతమైన టెంపుల్ టౌన్ సెట్ ఏర్పాటు చేసిన సురేష్ సెల్వరాజన్ ‘లూసిఫర్’ రీమేక్ కోసం మాసివ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. కాగా కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, – సూపర్ గుడ్ ఫిలిమ్స్, – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆర్.బి. చౌదరి, – ఎన్.వి.ప్రసాద్, – పరాస్ జైన్, వాకాడ అప్పారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్‌లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలిసింది.’ఆచార్య’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.