Thursday, January 23, 2025

భయపడొద్దు… జగన్ భరోసా ఇచ్చారు: చిరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భయపడొద్దని సిఎం జగన్ భరోసా ఇచ్చారని, సిఎం మాటలు తనకు ధైర్యామిచ్చాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గురువారం సిఎం జగన్ తో నటుడు చిరంజీవి సమావేశమైన విషయం తెలిసింది. ఈ సందర్భంగా చిరు మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని తెలిపాడు. వారం, పది రోజుల్లోనే అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందన్నారు. ఇండస్ట్రీ పైకి కనిపించేంత గ్లామర్‌గా ఉండదని, ఇండస్ట్రీలో రెక్కాడితే కానీ డొక్కాడనికార్మికులు ఎంతో మంది ఉన్నారన్నారు. థియోటర్లు మూసివేసుకోవాలేమో అన్న అభద్రతా భావంలో చాలా మంది ఉన్నారన్నారు. పండుగ పూట సిఎం జగన్ మోహన్ రెడ్డి ఓ సోదరుడిగా ఆప్యాయత చూపారన్నారు. కొంత కాలంగా ఇండస్ట్రీకి, ఎంపి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని చిరు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ రేట్ల ఇద్దరు మధ్య చర్చ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News