Monday, December 23, 2024

ఆ కష్టమే నన్ను నడిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

వయసు మీరుతున్నా మెగాస్టార్ చిరంజీవిలో ఇప్పటికీ అదే ఉత్సాహం, హుషారు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఈ వయసులో మీరు ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేయ గలుగుతున్నారు?’ అన్న ప్రశ్నకు చిరు సమాధానమిస్తూ “ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలున్నాయని అనుకుంటున్నారు. మరో ఐదు కథలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇటీవల ‘గాడ్‌ఫాదర్’ సినిమా షూటింగ్‌ను రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘బాబీ’ చిత్రానికి కూడా రాత్రి సమయంలోనే పనిచేయాల్సి వచ్చింది. అయినా నాకు అలసటగా అనిపించలేదు. మరింత ఉత్సాహంగా పనిచేశాను. మెగాస్టార్‌గా వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోడానికి ఎప్పుడూ కష్టపడుతునే ఉండాలి. అలా నేను పడే కష్టమే నన్ను మరింత ఆరోగ్యవంతుడిని చేసి ముందుకు నడిపిస్తోంది”అని అన్నారు. ఇక చిరంజీవి సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు చిరంజీవి మాట్లాడుతూ “కరోనా వల్ల షూటింగ్‌లు ఆగి, అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాక బడ్జెట్ భారీగా పెరిగింది. అసలుకి వడ్డీ కొసరు అయింది. పరిశ్రమ 42 శాతం పన్ను చెల్లిస్తోంది. అలాంటప్పుడు కష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోమని, టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని వేడుకోవడం తప్పేమీ కాదు” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News