మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల కాంబినేషన్ తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్టు ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేష్ చెల్లు పాత్రలో నటిస్తుండగా, తమన్నా చిరుకు జోడీగా అలరించనుంది. సోమవారం మే డే సందర్భంగా ఈ మూవీ నుంచి మెగాస్టార్ వింటేజ్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్స్ లో చిరు ఎంతో యంగ్ గా, హాండ్సమ్ గా ఛార్మింగ్ స్మైల్ తో కనిపిస్తున్నారు. ఇందులో చిరు టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేక వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష,ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read: వారికే నంది అవార్డులు: ఆదిశేషగిరి రావు