Wednesday, January 22, 2025

సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిరు మూవీ!

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 11న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే కథలో చాలా మార్పులు చేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా మెగాస్టార్ ఇమేజ్ కి సరిపోయే విధంగా సినిమాని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తూ ఉండగా తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఏంటి అనేది సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.

ఈ నేపధ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ చేయడానికి ఓకే చెప్పారట. ఇటీవల వశిష్ట మెగాస్టార్ కి కలిసి ఆయన ఇమేజ్‌కి సరిపోయే కథని వినిపించారట. ఇక కొత్త పాయింట్‌తో సోషియో ఫాంటసీ నేపధ్యంలో ఉన్న స్టొరీ లైన్ చెప్పడంతో మెగాస్టార్ కూడా ఆసక్తి చూపిస్తున్నారట. ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందనే టాక్ తెరపైకి వచ్చింది. గతంలో యముడికి మొగుడు, అంజి సినిమాలు చేశారు చిరంజీవి. ఇప్పుడు బింబిసార లాంటి సోషియో ఫాంటసీ కథతో హిట్ కొట్టిన వశిష్ట మల్లిడి మెగాస్టార్‌కి కూడా అదే తరహా స్టోరీలైన్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ లోనే చూపించడానికి రెడీ అవుతున్నాడట. ఇక ఈ మూవీని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News