Sunday, January 19, 2025

ఆ మాటలు పడుతుంటే నాకు బాధేస్తుంది: చిరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ పోరాటంపై ప్రత్యేక వీడియోను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరు మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఆఖరివాడైనా జనానికి మంచి చేయడంలో పవన్ ముందు వరసలో ఉంటాడని ప్రశంసించారు. సినిమాల్లోకి బలవంతంగా, రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడన్నారు. నా కంటే పవన్‌కు ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుందని చిరు తెలియజేశారు.

అధికారంలోకి రాకముందే ప్రజలకు సాయం చేసిన వ్యక్తి పవన్ అని, ఎందరో కౌలు రైతులు, జవాన్లు, జాలర్లకు సాయం చేశాడని, తన సంపాదనలో పెద్ద మొత్తాన్ని సాయం కోసం అందించారని, ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సిందనిపిస్తోందని కొనియాడారు. తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే ఏ అన్నకైనా బాధేస్తుందన్నారు. పవన్‌ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు తన విన్నపమని తెలిపారు. పిఠాపురం ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కల్యాణ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News