Monday, December 23, 2024

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. తారకరత్నను కాపాడిన వైద్యులు, దేవుడికి చిరు కృతజ్జతలు తెలిపారు. తీవ్ర అస్వస్థకు గురైన నందమూరి తారకరత్నకు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నట్టుగా నారాయణ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం వచ్చిన ఆయన తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. గుండె స్పందిస్తుందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News