- Advertisement -
హైదరాబాద్: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి వివరించారు. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్ని ప్రమాదం జరగడంతో బాలుడు గాయపడ్డాడు. వెంటనే శంకర్ ను స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బాబు అస్వస్థతకు గురికావడంతో స్వల్ప గాయాలు అయ్యాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్ సింగపూర్‌కు బయలుదేరే అవకాశం ఉంది.
- Advertisement -