Sunday, December 22, 2024

మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫిక్ అదిరింది…

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండగను సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోటుకు చేరుకుని సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీతోపాటు అల్లు ఫ్యామిలీ కలిసి సంప్రదాయ పద్దతిలో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారు.

ఈసందర్భంగా దిగిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. పాడి పంటల, భోగ భాగ్యాల ఈ సంక్రాంతి.. ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో చేసిన అభిమానులు.. మెగా ఫ్యామిలీని చూసి మురిసిపోతున్నారు. ఫోటో అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News