Monday, December 23, 2024

‘వాల్తేరు వీరయ్య’ మెలోడీ సాంగ్ ను లీక్ చేసిన చిరంజీవి.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక పవర్‌ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్‌ప్యాక్డ్‌గా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ , టీజర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోని ఓ పాటకు సంబంధించిన చిన్న బిట్‌ను లీక్ చేశారు. ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ కోసం చిత్ర బృందం ఫ్రాన్స్‌కు వెళ్లడం జరిగింది. అక్కడి మంచు అందాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ “ఈనెల 12న శృతిహాసన్‌తో నేను చేసిన సాంగ్ పూర్తయింది. ఫ్రాన్స్‌లోని విజువల్స్, సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. షూటింగ్ లొకేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి. సౌత్ ఫ్రాన్స్‌లోని ‘లేజ్’ ప్రాంతంలో షూటింగ్ చేశాము. ఈ లోయలో మైనస్ 8 డిగ్రీల చలిలో సాంగ్స్ స్టెప్స్ వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సాంగ్‌కు సంబంధించిన చిన్న బిట్‌ను మీ కోసం లీక్ చేస్తున్నా”అని అన్నారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News