Monday, December 23, 2024

మంచి కథలపై దర్శకులు దృష్టి పెట్టాలి

- Advertisement -
- Advertisement -

Chiranjeevi Speech at First Day First Show Pre Release

శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా సినిమా మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ప్రతిభ ఉండి కష్ట పడితే ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. పరిశ్రమలో ఈ స్థానంలో ఉన్నందుకు నా జన్మ సార్ధకమైయిందని భావిస్తాను. కంటెంట్ బావుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లోకి వస్తారు. మంచి కథలు, కంటెంట్‌పై దృష్టి పెట్టాల్సిన భాద్యత దర్శకులపై వుంది. నిర్మాత శ్రీజకి స్వాగతం పలుకుతున్నాను. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పెద్ద విజయం సాధించాలి” అని అన్నారు. నిర్మాత శ్రీజ మాట్లాడుతూ ఈ సినిమాని అందరూ థియేటర్లలో చూసి, భాగా ఎంజాయ్ చేసి పెద్ద హిట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనుదీప్, శ్రీకాంత్, సంచిత, ఏడాది శ్రీరామ్, అలీ, రధన్, లక్ష్మీనారాయణ, వంశీధర్ గౌడ్ పాల్గొన్నారు.

Chiranjeevi Speech at First Day First Show Pre Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News