Sunday, December 22, 2024

‘గాడ్ ఫాదర్’ నిశ్శబ్ద విస్పోటనం

- Advertisement -
- Advertisement -

Chiranjeevi speech at Godfather pre release event

మెగాస్టార్ చిరంజీవి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ’గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “మలయాళంలో విజయం సాధించిన ‘లూసిఫర్’ చూడటం జరిగింది.

ఇది ‘గాడ్ ఫాదర్’గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్‌చరణ్. సినిమా బావుంది, నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్‌చరణ్ ముందుకు వచ్చి ’మీ ఇమేజ్‌కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్’ అని చరణ్ చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది ‘గాడ్ ఫాదర్’గా రూపాంతరం చెందింది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. చరణ్‌తో కలసి సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. ‘గాడ్ ఫాదర్’ నిశ్శబ్ద విస్పోటనం”అని తెలిపారు. ఈ ఈవెంట్‌లో మోహన్ రాజా, సత్యదేవ్, తమన్, రామజోగయ్య శాస్త్రి, షఫీ, రామ్-లక్ష్మణ్, లక్ష్మీ భూపాల, చిట్టి, నాగమహేష్, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi speech at Godfather pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News