Friday, December 20, 2024

అయోధ్య రామమందిరానికి ‘హను-మాన్’ టికెట్ పై రూ.5 విరాళం: చిరు

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో తేజ సజ్జ, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘హను-మాన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ కూడా షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుత స్పందన రావడంతో.. మేకర్స్ మరింత జోష్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపుతూ, ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. మా ‘హను-మాన్’ సినిమా థియేటర్లలో ఆడినన్నీ రోజులు కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి ఇవ్వనున్నట్లు చిత్రబృందం చెప్పారని ఆయన తెలిపారు.అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తమకు కూడా ఆహ్వానం అందిందని.. జనవరి 22న అక్కడికి వెళ్తున్నట్లు చిరు చెప్పారు.

నిర్మాత నిరంజన్ రెడ్డి ‘హను-మాన్‌’ మూవీని డబ్బులకు వెనకాడకుండా భారీ బడ్జెట్ నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ మూవీ.. ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఎక్కువ మంది ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ విషయంలో గుంటూరు కారం మూవీని బీట్ చేసింది ఈ సినిమా. ఇందులో తేజ సరసన అమృత అయ్యర్‌ కథానాయిక నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News