Saturday, January 11, 2025

మారుతికి ఆడియన్స్ ప్లస్ తెలుసు..

- Advertisement -
- Advertisement -

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ “గోపీచంద్ విలక్షణ నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. గోపీచంద్ సినిమాల్లో ‘సాహసం’ నాకు చాలా ఇష్టమైన సినిమా. దర్శకుడు మారుతి మంచి కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. మారుతితో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను”అని అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా బ్యానర్‌లో గోపీచంద్ మంచి సినిమా చేశారు. మారుతికి ఆడియన్స్ ప్లస్ తెలుసు. కథ నుంచి బయటకు వచ్చి కూడా ప్రేక్షకులను నవ్వించగలడు. ‘పక్కా కమర్షియల్’ సినిమాను అతను అద్భుతంగా తెరకెక్కించాడు” అని తెలిపారు. గోపీచంద్ మాట్లాడుతూ “మారుతి తన టాలెంట్‌తో ఇంకా పెద్ద దర్శకుడు అవుతారు. ఈ సినిమాను అతను చాలా బాగా చేశారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రాశీ ఖన్నాతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Chiranjeevi speech at Pakka Commercial Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News