Thursday, January 16, 2025

త్రిషకు అండగా నిలబడతా: మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారటం లేదు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు మన్సూర్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా చేపట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా చిరంజీవి కూడా ఈ సంఘటనపై మండిపడ్డారు. తోటి ఆర్టిస్టుపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సహించరానివనీ, సభ్యసమాజం తల వంచుకునేలా ఉన్నాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు. త్రిషకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News