Monday, December 23, 2024

ఓల్డ్ గెటప్‌లో… డ్యూయల్ షేడ్‌లో

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం విశ్వంభర. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ ప్లానింగ్ ప్రకారం ఒక్కో షెడ్యూల్ పూర్తి చేసుకుంటోంది. డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను మెగాస్టార్ చేస్తుండడంతో దీనిపై హైప్ మెగా ఫ్యాన్స్‌లో నెక్స్ లెవెల్లో ఉంది. ఇక ఈ చిత్రంలో చిరు ఒక ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తారని టాక్. చిరంజీవి గతంలో… అది కూడా తన యంగ్ ఏజ్‌లోనే ఈ తరహా పాత్రలు చేశారు.

ఒక స్నేహం కోసం, శ్రీ మంజునాథ లాంటి చిత్రాల్లో ఓల్డ్ లుక్‌లో తన నటనతో అదరగొట్టిన చిరు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడం విశేషం. ఈ విషయం మెగా అభిమానులను ఎంతో ఆనందపరుస్తోంది. విశ్వంభర సినిమాలో చిరు ఎలా కనిపిస్తారో అని వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News