Thursday, April 3, 2025

‘విశ్వంభర’ కోసం చిరు మరోసారి..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’.  బింబిసార ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది.ఈ మూవీని యూవి క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్నఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈక్రమంలో ఓ ఆసక్తికర వార్తా టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరుతో ఓ సాంగ్ పాడించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే సాంగ్ పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో చిరు.. మృగరాజు సినిమాతోపాటు పలు సినిమాలో పాటలు పాడి అలరించారు. చాలా కాలం తర్వాత మరోసారి మెగాస్టార్ తన గాత్రంతో అలరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News