Monday, December 23, 2024

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగస్టార్ చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తన సతీమణితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో దంపతులు చిరంజీవి, సురేఖ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టిటిడి అధికారులు, అర్చకులు చిరుకు ఘనంగా స్వాగతం పలకడంతో పాటు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసిన అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆలయం లోపల, వెలుపల చిరంజీవిని చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అనంతరం చిరంజీవి తిరుమలలో బస చేసిన అతిథి గృహం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం రాత్రి చిరు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. చిరంజీవి కుటుంబం గత రాత్రి తిరుమలలో బస చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News